గిద్దలూరు: రాచర్ల మండలంలోని పెట్రోల్ బంకులను సీఐ రామకోటయ్య, ఎస్సై కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య తెలిపారు. మంగళవారం రాచర్ల మండలంలోని పెట్రోల్ బంకులను ఎస్సై కోటేశ్వరరావు తో పాటు సీఐ రామకోటయ్య తనిఖీలు చేపట్టారు. డీజిల్ కొంతవరకు లోటు ఉన్న ఈరోజు డీజిల్ స్టాక్ రావడంతో అది సమిసి పోయిందని సీఐ తెలిపారు. ప్రజలు కూడా బల్క్ గా డీజిల్ పెట్రోల్ తీసుకువెళ్లడానికి వీలు లేదని తెలిపారు. వాహనాలతో మాత్రమే వచ్చి పెట్రోల్ డీజిల్ పోయించుకోవాలని సిఐ సూచించారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే పెట్రోల్ బంకుల నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.