రాయదుర్గం: పట్టణంలో చిన్న పీర్ల పండుగలో యువకుల మద్య ఘర్షణ, తీవ్రంగా గాయపడిన ఐదుగురు యువకులు
రాయదుర్గం పట్టణంలో చిన్న పీర్ల పండుగలో యువకుల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో ఐదుగురు యువకులు గాయపడటంతో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు. మంగళవారం రాత్రి ఊరువాకాలి సమీపంలో పీర్ల ఊరేగింపులో ఇద్దరి మద్య జరిగిన చిన్న పాటి గొడవ పెద్దదిగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చిరు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.