విశాఖపట్నం: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పక్షుల కోసం చిరుధాన్యాలు చల్లిన విద్యార్థులు
బాలల దినోత్సవం సందర్భంగా విశాఖలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం జరిగింది. రానున్న తుఫాను దృష్ట్యా పశుపక్ష్యాదుల కోసం కొండ ప్రాంతాల్లో చిరుధాన్యాలు చల్లాలని సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ కోరారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విత్తన బంతులు తయారు చేశారు.