మార్కాపురం: జిల్లా కేంద్రంలో వెలిసిన చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒకవైపు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు