రాయదుర్గం: పాముకాటుతో మృతి చెందిన కూలీ కుటుంబాన్ని ఆదుకోవాలి : జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వెంకటరమణ
రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి చిట్టెమ్మ పాము కాటుకు గురై మృతి చెందడం బాధాకరమని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బి. వెంకటరమణ అన్నారు. శనివారం మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తున్న చిట్టెమ్మ మృతితో వారి కుటుంబం దుర్భర పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పాము కాటు జరిగిన ప్రాంతంలో పారిశుధ్యం లేకపోవడం, వీధి దీపాలు వెలగకపోవడం, కలుపు, ముళ్ల పొదలు ఉండటం వంటి సమస్యలను గుర్తి