రాయదుర్గం: ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి : ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొట్రేష్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొట్రేష్ డిమాండ్ చేశారు. బుధవారం రాయదుర్గం పట్టణంలో ఆ సంఘం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డివిజన్ అధ్యక్షులు కుమార్ నాయక్, నాగయ్య, దివాకర్, గంగాధర, రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.