గిద్దలూరు: కొమరోలు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై నాగరాజు, నిబంధనలు పాటించాలని హెచ్చరిక
మార్కాపురం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై నాగరాజు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆటోలో నడపాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటోలకు అనధికారకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లు తొలగించాలని ఆటో డ్రైవర్లకు తెలిపారు.