కనిగిరి: కంభం లో పెళ్లి బృందాన్ని ఢీకొట్టిన లారీ నలుగురు మృతి, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలోరికార్డ్ అయిన ప్రమాద దృశ్యా
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందాన్ని లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయింది. అధికారులు దర్యాప్తులో భాగంగా సిసి ఫుటేజ్ ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీర్పు చూస్తే ఎవరైనా భయపడవలసిన పరిస్థితి అని పోలీసులు అన్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.