దర్శి: దొనకొండ మండలంలో దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు ముద్దాయిలని అరెస్టు చేసినట్లు తెలిపిన సీఐ రామారావు
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వివిపురం ఎర్రపాలెం లో జరిగిన దొంగతనం కేసులకు సంబంధించి ఇద్దరు ముద్దాయిలను పోలీసుల అరెస్టు చేశారు. సంబంధిత వివరాలను సీఐ రామారావు వెల్లడించారు. బాలకృష్ణ, ఇమ్మానియేల్ జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 2.2 లక్షల విలువైన 11.5 గ్రాముల బంగారం 38 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకొని కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు.