తాడిపత్రి: ఎస్సై దయాకర్ పోలీస్ స్టేషన్ పైకి తీసుకెళ్లి కాలు విరిగేటట్లు కొట్టాడు: తాడిపత్రిలో బాధితుడు మురళీమోహన్ రెడ్డి
తాడిపత్రి ఎస్సై దయాకర్ తనను పోలీస్ స్టేషన్ పైకి తీసుకెళ్లి కాలు విరిగేటట్లు విచక్షణారహితంగా కొట్టాడని బాధితుడు మురళి మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తాడిపత్రిలో మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఆయన విలేకరులతో తన గోడును వెల్లబోసుకున్నాడు. నా భార్య ఇచ్చిన కంప్లైంట్ ను ఆసరాగా తీసుకొని ఎస్ఐ దారుణంగా కొట్టాడన్నారు. భార్యాభర్తలను సర్ది చెప్పి కలపాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. న్యాయం చేయాలని కోరాడు.