యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్ట్ నిజమైన నిర్వాసితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు నిర్వాసితులు వినతి పత్రం
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో వెలుగొండ ప్రాజెక్టు నిజమైన లబ్ధిదారులను తొలగించి నకిలీ లబ్ధిదారులను గెజిట్లో చేర్చారని నిర్వాసితుడు ఏడుకొండలు జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడుతూ... రికార్డులలో నకిలీ ఇండ్లు ఫోటోలు పేర్లు జత చేసి 2022 సంవత్సరం తర్వాత తారుమారు చేశారని అన్నారు. న్యాయం చేయాలని కోరారు