దర్శి: దర్శి లో డాక్టర్ చెన్నయ్య పార్థివ దేహానికి ఘన నివాళులర్పించిన టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ దంపతులు
Darsi, Prakasam | May 27, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఏపీ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు నియోజకవర్గ గౌరవ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెన్నయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు మాజీ ఎమ్మెల్యే నారప్ప శెట్టి పాపారావు మరియు పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.