మార్కాపురం: మార్కాపురం ఎస్టేట్లో రెండు రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి
మార్కాపురం ఎస్టేట్లోని రెండు రేషన్ దుకాణాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఒక రేషన్ దుకాణంలో 50 కేజీల రేషన్ బియ్యం ఎక్కువగా ఉన్నాయని, 17 కేజీల చక్కర, 87 కేజీల గోధుమపిండి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణదారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.