యర్రగొండపాలెం: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ పై కేసు నమోదు చేయాలని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేసు నమోదు చేయాలని ఎస్సై ని కోరారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.