మార్కాపురం: జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఉత్సాహం కనపరిచారు. కొందరు సైకిల్ మీద మరికొందరు నడుచుకుంటూ ఆయా పాఠశాలలకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి రోజు మనబడి మన పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎంలు తెలిపారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.