రాయదుర్గం: గొడిశలపల్లి లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్
డి.హిరేహాల్ మండలంలోని గొడిశలపల్లి లో పలు అభివృద్ధి పనులను స్థానిక MLA కాలవశ్రీనివాసులతో కలసి మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. రూ.126 లక్షలతో నిర్మించిన 2 వ్యవసాయ గోదాములు, 20 లక్షల గొడిశలపల్లిలో తాగునీటి పథం, రూ.194 లక్షలతో నిర్మించిన గొడిశలపల్లి - జక్కలవడి తారు రోడ్డు, రూ.196 లక్షలతో నిర్మించిన కూడ్లూరు - పాతహడగిలి తారు రోడ్డు ను ప్రారంభిస్తూ గొడిశలపల్లిలో శిలాఫలకాలను ఆవిష్కరించారు.