గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 32 మందికి రూ.22 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం జరిగిందని పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని అన్నారు.