మార్కాపురం: వేములకోట గ్రామంలో వైఎస్ఆర్సిపి యూత్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి రాంబాబు
మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో వైయస్సార్సీపి ఆధ్వర్యంలో యూత్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, అన్నా రాంబాబు పాల్గొన్నారు. క్రీడల్లో మంచిగా రాణించాలని యువతను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు