తాడిపత్రి: మదనంతపురంలో విషాదం, చిన్నాన్న కొడుకు (తమ్ముడు) పెళ్లికి టెంకాయ పట్టలు కొడుతుండగా విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి
కొలిమిగుండ్ల మండలం మదనంతపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చిన్నాన్న కొడుకు (తమ్ముడు) పెళ్లికి టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయ పట్టలు కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు వైర్లు తగిలి గంగ శివుడు (30) కిందపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు గంగ శివుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.