యర్రగొండపాలెం: జూన్ 15వ తేదీలోపు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కలెక్టర్గా నూతన బాధ్యతలు చేపట్టిన విజయ సునీత మొదటిసారి వెలుగొండ ప్రాజెక్టును ఇప్పటికే పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ 15వ తేదీ లోపు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. గడువులోపు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.