కళ్యాణదుర్గం: కంబాల పల్లెలో తమ సమీప బంధువులే తమపై భూమి కోసం దాడికి పాల్పడ్డారు : బాధితుడు లోకేష్ ఆవేదన
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని సెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామంలో తమ సమీప బంధువులే తమపై దాడికి పాల్పడ్డారని లోకేష్ ఆవేదనను నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వ్యక్తం చేశారు. ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడినట్లుగా వెల్లడించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.