యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో దొంగతనం విలువైన బంగారు నగలు చోరీ
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో భారీ చోరీ కలకలం రేపింది. ఆనేకాళ్ళ వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి సుమారు 35 నుంచి 40 లక్షల విలువైన బంగారం, రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు. వెంకటేశ్వర రెడ్డి సర్జరీ నిమిత్తం కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీఐ అజయ్ కుమార్, ఎస్సై సైదుబాబు, ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరిస్తూ దుండగుల కోసం గాలింపు చేపట్టారు.