కొండపి: ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించిన పోలీసులు, హెల్మెంట్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనదారులకు గురువారం పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఇటీవల జాతీయ రాష్ట్రీయ రహదారులపై అత్యధికంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు వివరించారు. ద్విచక్రం వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పోలీసులు వాహనదారులకు తెలిపారు. అలానే సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.