రాయదుర్గం: 75 వీరాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం వాసి మృతి
గుమ్మగట్ట మండలంలోని 75 వీరాపురం గ్రామ సమీపంలో శుక్రవారం మద్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి చెందిన జె.రిజ్వాన్ (33) మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు కార్పెంటర్ వృతి చేసుకుని జీవనం సాగిస్తున్న ఇతను బైక్ పై గుమ్మగట్ట వైపు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొనింది. ప్రమాదంలో అతని తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని పరీక్షించారు. అప్పటికే మృతి చెందినట్లు వారు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు, మున్నీరుగా విలపించారు. ప్రమాద ఘటనపై గుమ్మగట్ట పోలీసులు