యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు పురోగతి పనులను పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు పురోగతి పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానమైన వెలుగొండ ప్రాజెక్టు పనులను జూన్ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధ ప్రతిపాదికన పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. శ్రీశైలం కొల్లం వాగు నుంచి సొరంగంలోకి ప్రయాణించి స్వయంగా పనులను పరిశీలించారు. దోర్నాల టన్నెల వద్ద జరుగుతున్న ఫీడల్ కెనాల్ పనులను పరిశీలించారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన 900 కోట్ల రూపాయలను ఏప్రిల్ నుంచి జూన్ వరకు విడతల వారిగా చెల్లిస్తామన్నారు.