మార్కాపురం: బుడ్డపల్లిలో ఇండ్లు పడగొట్టడంతో న్యాయం జరిగేంతవరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని తెలిపిన వికలాంగులు
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం బుడ్డపల్లి గ్రామ సమీపంలో 2006 సంవత్సరం వికలాంగులకు దాతలు 5 ఎకరాల ఇళ్ల స్థలం ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటివరకు వికలాంగులు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కొందరు ఇండ్లను పడగొట్టి ఖాళీ చేయాలని చెప్పినట్లుగా బాధితులు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ కు మూడుసార్లు అర్జీలు ఇచ్చామన్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని బాధితులు తెలిపారు