మార్కాపురం: సుందరయ్య కాలనీలో ప్రభుత్వ పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుందరయ్య కాలనీకి చెందిన కాలనీవాసులు ప్రభుత్వ పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని నిరసన తెలియజేశారు. 63 మంది చిన్నారులు ఉండగా రేకులు బెచ్చలు గోడతో నిర్మించిన స్కూలు వర్షానికి కూలే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆరోపించారు. భయంతో స్కూలుకు పిల్లలు వెళ్తున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.