రాయదుర్గం: ఎట్టకేలకు ప్రారంభానికి నోచుకున్న నగరవనం పార్కు
రాయదుర్గం పట్టణ శివారులోని బళ్ళారి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నగరవనం పార్కు ఎట్టకేలకు ప్రారంభమైంది. పార్కు ఏర్పాటు చేసి చాలా రోజులైనప్పటికీ ప్రారంభానికి నోచుకోని విషయం తెలిసిందే. అయితే బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో నగరవనం పార్కు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్థానికంగా లైవ్ ఏర్పాటు చేసి స్థానిక అటవీ అధికారులు పాల్గొన్నారు.