రాయదుర్గం: బొమ్మనహాల్ మండల కురుబ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
బొమ్మనహల్ మండల కురుబ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికయింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన సభలో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డి.దిలీప్ కుమార్, అధ్యక్షుడిగా కేకే తిప్పేస్వామి, ఉపాధ్యక్షులుగా యం.తిప్పేస్వామి, అంజిని, ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున, ప్రచార కార్యదర్శిగా వీకే హిర్ధాళప్ప ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి డిమాండ్ చేశారు. సంఘం అభివృద్ధి. కురుబల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు.