మార్కాపురం: జిల్లాలో వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో ప్రజల రెవెన్యూ సమస్యలను గ్రామస్థాయిలోనే వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు ప్రతి మండలంలో ప్రతి నెల ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో వరుసగా నాలుగు వారాలపాటు నాలుగు విడతలుగా ప్రత్యేక రెవెన్యూ గ్రామ సందర్శనలు ఉంటాయన్నారు