దర్శి: దర్శి పట్టణంలో విపరీతమైన గాలులు ఉరుములతో కూడిన వర్షం, చల్లబడిన వాతావరణం
Darsi, Prakasam | Jun 15, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో మోస్తారు వర్షం కురిసింది. విపరీతమైన గాలులు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. వాహనదారులు చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది.