Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: పాలీసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత

India | Apr 20, 2026
ఏప్రిల్ 25వ తేదీన జరగబోవు పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, వైద్య సదుపాయం, బస్సుల సౌకర్యం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలోని మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నారు.
మార్కాపురం: పాలీసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత - India News