గిద్దలూరు: బేస్తవారిపేట మండలం చిన్న కంభం అడ్డరోడ్డు వద్ద చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, ద్విచక్ర వాహనదారుడు మృతి
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్న కంభం గ్రామ సమీపంలోని అడ్డరోడ్డు వద్ద మంగళవారం అద్భుతప్పి ఓ చెట్టును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఘటనలో కంభం మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన పూసలపాటి బాలంకయ్య మృతి చెందాడు. మొదట తీవ్రంగా గాయపడ్డ బాలంకయ్యను అంబులెన్స్ లో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.