దర్శి: పడమర కాజీ పురం గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు గ్రామస్తులు
Darsi, Prakasam | Jun 27, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాజీపురం గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో వాహనదారులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ మట్టి రోడ్డు లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వర్షాకాలం నీటి గుంతలతో బురదలతో తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి వస్తున్నాయి కానీ మా రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు వేయాలని కోరారు.