మార్కాపురం: జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
మార్కాపురం జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. తర్లుపాడు రోడ్డులోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ విగ్రహంతోటి సాంస్కృతిక కార్యక్రమాల మధ్య శోభయాత్ర కొనసాగింది. నాలుగు మాడవీధులలో భక్తులు హనుమాన్ కాషాయ జెండాలను చేత పట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మారుమోగిపోయింది. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.