గిద్దలూరు: కంభం పట్టణంలోని జాతీయ రహదారిపై పెళ్లి బృందం ఆటోని ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి ఎనిమిది మందికి గాయాలు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ఆటోని లారీ ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళికూతురు కొబ్బరికాయ కొట్టేందుకు వినాయకుడి గుడి వద్ద దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.