రాయదుర్గం: చదం గేట్ సమీపంలోని కొండ వద్ద ఇసుక అక్రమ డంప్
గత కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్న ఇసుక మాఫియా మళ్లీ యాక్టివ్ అయ్యింది. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటూ సొమ్ము చేసుకుంటోంది. రాయదుర్గం-బళ్లారి రోడ్డు, చదం గేటు వద్ద కొండ పక్కన సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేశారు. ఈరాత్రి టిప్పర్లలో కర్నాటకకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు ఉచిత ఇసుకను సొంత అవసరాలకే అని చెప్పినా, ఇక్కడ కొందరు దానిని వ్యాపారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి డంప్ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.