గిద్దలూరు: బేస్తవారిపేట మండలం కొత్తపల్లి వద్ద ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళలను ట్రాక్టర్ డీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు బేస్తవారిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన కొమ్మ పెద్ద రంగమ్మ(41)గా పోలీసులు గుర్తించారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తెలిపారు.