కొండపి: సింగరాయకొండలో ఘనంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, అశ్వ వాహనంపై ఊరేగిన స్వామివారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు భక్తులకు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నరసింహస్వామిని విశేషంగా అలంకరించి, ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చి, గోవింద నామస్మరణలతో నీరాజనాలు పలికారు.