కనిగిరి: మిస్ ఇండియా శ్రీరంగం దీప్తిని కొనియాడిన కనిగిరి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు ఉగ్ర నరసింహ రెడ్డి
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాయుడు బజార్లో MLA కందుల ప్రభ ఏర్పాటు చేశారు. TDP నేత ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా MLAతోనే సాధ్యమైందన్నారు. మార్కాపురం వాసి శ్రీరంగం దీప్తి మిస్ ఇండియాగా ఎంపికై జిల్లాకు మంచి పేరు తెచ్చిందన్నారు. మిస్ ఇండియాగా ఎంపిక అవ్వడం అంత ఆశామాషీ వ్యవహారం కాదని ఆయన పేర్కొన్నారు.