కనిగిరి: పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీని నిర్వహించిన కనిగిరి RDO వెంకట శివరామిరెడ్డి
కనిగిరి పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర , స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కనిగిరి ఆర్డీవో ఎం వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం రోడ్లపై ఉన్న చెత్త, వ్యర్ధాలను తొలగించి, పరిసరాల పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు ఆర్డిఓ శివరామిరెడ్డి అవగాహన కల్పించారు.