రాయదుర్గం: అభివృద్ధి, సంక్షేమం సిఎం చంద్రబాబు కు రెండు కళ్లు : ఎమ్మెల్యే గుమ్మనురు జయరాం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్లులా బావించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనురు జయరాం అన్నారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం గలగల గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు తో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రగతి పండుగ పేరుతో పది రోజులు ఎమ్మెల్యే వివిధ కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.