రాయదుర్గం: పట్టణంలో దుఖాణాదారుడికి రూ. 25 వేలు ఫైన్ : లీగల్ మెట్రాలజీ ఇనిస్పెక్టర్ శంకర్
పట్టణంలోని పలు ధుఖాణాలలో అధిక ధరలకు నిత్యావసరాలను విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారపై లీగల్ మెట్రాలజీ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా విఏ బజార్ లో వస్తువులపై ముద్రించిన ఎంఆర్పి ధర కంటే అధిక మొత్తంలో వసూలు చేసిన ఘటన చోటు చేసుకోవడంపై వినియోగదారుల పిర్యాదుతో లీగల్ మెట్రాలజీ ఇనిస్పెక్టర్ శంకర్ శనివారం తనిఖీలు నిర్వహించారు. ఒక వినియెగాదారుడు కొన్న ప్యాకేజీపై ఎంఆర్పి 105 ఉండగా రూ.175 కి విక్రయించారని తేలడంతో నిర్వాహకుడికి రూ. 25 వేలు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.