రాయదుర్గం: శర వేగంగా మురడి ఆంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణం పనులు
*మురడిలో వ్యాసరాయల ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం శరవేగం* డి.హిరేహాల్ మండలం మురడి గ్రామంలో వ్యాసరాయలు ప్రతిష్టించిన సుప్రసిద్ధ ఆంజనేయస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా, హగరి గాదిలింగప్ప అనే భక్తుడు సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో నూతన ఆలయ నిర్మాణానికి ముందుకు రావడంతో దేవాదాయశాఖ అధికారుల నుంచి అనుమతులు లభించాయి. గత నెల రోజుల క్రితం శాస్త్రోక్తంగా పాత గర్భాలయాన్ని తొలగించి, నూతన ఆలయానికి రాతి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇప్పటికే పునాది, బేస్ మట్టం పనులు పూర్తయ్యాయి.