రాయదుర్గం: గత మూడు నెలల్లో 7 సార్లు కంపోస్టు యార్డ్ లో చెత్త కు ఆకతాయిలు నిప్పు పెట్టారు : మున్సిపల్ కమిషనర్
ఆకతాయిలు చేస్తున్న పనికి మున్సిపాలిటీకి ఆర్థిక నష్టం సిబ్బంది సమయం వృధా కావఢడంతోపాటు స్థానికులు వాయు కాలుష్యం బారిన పడాల్సిన పరిస్థితి దాపురించింది. గత 3 నెలల్లో 7 సార్లు కంపోస్టు యార్డ్ లో చెత్తకు నిప్పుపెట్టారని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్, ఫైర్ సిబ్బంది చాలా శ్రమపడి మంటలను అదుపులోకి తెస్తున్నామన్నారు. పోలీసులకు పిర్యాదు చేశామని, ప్రజలు ఇలాంటి వారి సమచారం తెలపాలని కోరారు.