కళ్యాణదుర్గం: అపిలేపల్లి లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించిన మహిళలు
కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు పంచాయితీ అధికారులకు, మండల పరిషత్ అధికారులకు విన్నవించారు. అయినా స్పందించలేదు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో బుధవారం రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.