రాయదుర్గం: జూన్ 5 నుంచి ప్రారోభమయ్యే SIR ఓటరు వెరిఫికేషన్ కు సహకరించాలి : రాయదుర్గం తహసీల్దార్ హరికుమార్
జూన్ 5 నుంచి ప్రారోభమయ్యే SIR ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని దీనికి రాజకీయ పార్టీలు సహకరించాలని రాయదుర్గం తహసీల్దార్ హరికుమార్ కోరారు. శనివారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబరు 22 న తుది ఓటరు జాబితా విడుదల అవుతుందని వివరించారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు బిఎల్ఓ లతో పార్టీల బిఎల్ఏలు సమన్వయం చేసుకుని సహకరించాలని కోరారు. చట్టాల పట్ల అవగాహన పెంచుకుని ఇంటి వద్దకు వచ్చే బిఎల్ఓలకు తగిన డాక్యుమెంట్ లు ఇచ్చి తప్పులు సవరించుకోవచ్చని సూచించారు.