మార్కాపురం: మున్సిపల్ కార్మిక్ కార్మికుడికి పెండింగ్లో ఉన్న జీతం చెల్లించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కరించాలని కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బరాయుడు మాట్లాడుతూ తప్పెట్ల శేషులు గత 15 సంవత్సరాల పైగా దూపాడు పంప్ హౌస్ లో టర్నాకాక్ అప్కాస్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు అన్నారు. అయితే గత మూడు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబం గడవక కష్టంగా మారిందన్నారు. ఆఫీస్ వద్దకు వెళ్లి విచారించగా అప్కాస్ రికార్డుల్లో పేరు తొలగించబడిందని అధికారులు తెలియజేసినట్లు తెలిపారు.