దర్శి: దర్శి పట్టణంలో సిఐటియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సిఐటియు ఏఐటీయూసీ నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జండాలను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసే విధంగా లేబర్ కోడ్స్ అమలు చేస్తుందన్నారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎనిమిది గంటల పని దినం కల్పించాలని కనీస వేతనం అమలు చేయాలని కోరారు.