మార్కాపురం: తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామంలో ప్రధాన రహదారిపై ఉధృతంగా ప్రవహించిన వర్షపు నీరు
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామంలో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం పడింది. దీంతో సమీపంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహించింది. కొండల ప్రాంతాల నుండి లోతట్టు ప్రాంతానికి భారీగా వర్షపు నీరు చేరడంతో రహదారి బ్రిడ్జి గుండా పొలాలలోకి నీరు చేరింది. వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ప్రాంతంలోని పొలాలు అన్ని వర్షపు నీటితో చెరువును తలపించాయి